సీఎం చంద్ర‌బాబు గారూ.. ‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి ఏం చేయగలనో చెప్పండి’: అనంత్ అంబానీ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌తో రైతులను సీఈఓలుగా మారుస్తామ‌న్న అనంత్‌ ఏపీలో రూ.1 లక్ష కోట్లతో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న రిలయన్స్ ఏఐ, డ్రోన్ల టెక్నాలజీతో రైతులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామ‌ని వెల్ల‌డి అనంత్ ప్రసంగానికి మంత్రముగ్ధులైన నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు

మదనపల్లె,అర్జున్ సమాచారం: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని, రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్న తన సంకల్పాన్ని బలంగా చాటిచెప్పారు. "నన్ను మీ ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయాలో, ఏ సేవ అందించాలో మీరే మార్గనిర్దేశం చేయండి" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన వినమ్రంగా కోరారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' (ఐఎస్‌ఏ) శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్ అంబానీ చేసిన ప్రసంగం సభికులను, వేదికపై ఉన్న ప్రముఖులను విశేషంగా...