సీనియర్ ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు.. నవంబర్ 13న హైకోర్టు విచారణ సర్వీస్, సీనియారిటీ అంశాల్లో ఏళ్లుగా అమలుకాని తీర్పులపై పిటిషన్లు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులకు కోర్టు ఆదేశం తదుపరి విచారణకు అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశం

విజ‌య‌వాడ‌,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో  ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న, పదవీ విరమణ చేసిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు ఈ నెల 13న విచారణ జరపనుంది. ఉద్యోగుల సర్వీసు అంశాల్లో న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ పిటిషన్లను సచివాలయ సిబ్బంది, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు, టీటీడీ ఉద్యోగులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్...