సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు
మంచిర్యాల :అర్జున్ సమాచారం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిధిలోని గర్మిళ్ల ప్రాంతంలో మల్లేష్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు అదే సమయంలో ఆయన వెనుక కారులో వస్తున్న వైద్య దంపతులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సునీత వెంటనే స్పందించి సీపీఆర్ చేసి మల్లేష్ ప్రాణాలను కాపాడారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వైద్య దంపతుల మానవత్వం చాలా గొప్పదని అందరు ప్రశంశించారు అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎంత కీలకమో సమాజానికి తెలియజేసిన...