సీపీఆర్‌ శిక్షణతో ప్రాణాలు కాపాడాలి అత్యవసర సమయాల్లో సీపీఆర్‌ ఎంతో కీలకం ప్రతి పోలీసు సిబ్బంది సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

మెదక్: ఆగస్టు.22,అర్జున్ సమాచారం: అత్యవసర పరిస్థితుల్లో అందించే సీపీఆర్‌ శిక్షణను సద్వినియోగం చేసుకుని విలువైన ప్రాణాలను కాపాడాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. పోలీసులు నిత్యం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తారని, ప్రమాదాలు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలానికి ముందుగా చేరుకునే అవకాశం పోలీసులకే ఎక్కువగా ఉంటుందని తెలిపారు.యూత్‌ ఫర్‌ సేవా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయ పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహించారు. అత్యవసర సమయంలో సీపీఆర్‌ను...