సుడా ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగింపా.. కొత్త ముఖానికా..? తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు.. అధిష్ఠానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
కరీంనగర్, రూరల్ జూలై 6,అర్జున్ సమాచారం: కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఛైర్మన్ పదవిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఛైర్మన్‌గా ఎవరికి అవకాశం దక్కనుందన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుత ఛైర్మన్‌కే మరోసారి అవకాశం కల్పిస్తారా? లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్న అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సుడా ఛైర్మన్ పదవి...