సునీల్ బన్సాల్ ఫిర్ ఆగయా…
హైదరాబాద్, సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం: తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో అధిష్టానం కీలక అడుగు వేసింది. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ వ్యూహకర్త సునీల్ బన్సల్‌నే మళ్లీ నియమిస్తూ, ఆయనకు సహకారంగా ఇద్దరు సహ ఇన్‌ఛార్జులను కూడా రంగాంలోకి దించింది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, దాదాపు 35 శాతానికి పైగా ఓట్ షేర్ సాధించి కమలదళం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏకైక ప్రత్యామ్నాయం తామేనన్న...