ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సుప్రీం కోర్టులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఎదురుదెబ్బ అయన ఆస్థి వేలం సబబే

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సూప్రీం కోర్టు  లో చుక్కెదురయింది. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను  సుప్రీం కోర్టు  కొట్టివేసింది. లంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందే అని స్పష్టం చేసింది.  అప్పు వసూళ్లలో భాగంగా సినీ నిర్మాత బండ్ల గణేష్కు చెందిన జూబ్లీహిల్స్లోని ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసింది. వేలాన్ని  రద్దు చేస్తూ డీఆర్టీ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. డీఆర్టీ తీర్పును తెలంగాణ హైకోర్టులో యూనియన్ బ్యాంక్ సవాల్ చేసింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్ తీసుకున్న అప్పులకు బండ్ల గణేష్ కుటుంబం హామీదారులుగా ఉన్నారని యూనియన్ బ్యాంక్ వాదన.
సర్ఫేస్ ఈ చట్టం కింద 2019లో స్వాధీనం చేసుకుని 2022లో వేలం నిర్వహించగా 8.51 కోట్ల రూపాయలు వచ్చాయని హైకోర్టుకు యూనియన్ బ్యాంక్  తెలిపింది.
అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.82 కోట్లలో వేలం సొమ్మును మినహాయించుకోవాలన్న దానికి అంగీకరించి మళ్ళీ డీఆర్టీని ఆశ్రయించారని  యూనియన్ బ్యాంక్  తెలిపింది. ఎన్సీఎల్టీలో దివాలా పరిష్కార ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఆస్తుల వేలం చెల్లదని బండ్ల గణేష్ వాదన .
అయితే కంపెనీ ఆస్తి కాదని, హామీదారుల ఆస్తిపై ఎలాంటి నిషేధం లేదని  యూనియన్ బ్యాంక్  తెలిపింది.యూనియన్ బ్యాంక్ వాదనతో ఏకీభవిస్తూ బండ్ల గణేష్ పిటిషన్ను  తెలంగాణ హైకోర్టు కొట్టెసింది. దాంతో బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది.