ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 8:03 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

అమరావతి,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నయుడు బుదవారం నాడు సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించారు. అర్నబ్ తుఫాన్ గమనాన్ని… ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని ఆర్టీజీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను సీఎం  అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్లా ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు  ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వివరించారు. మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎంకు  అధికారులు వివరించారు.