సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా కమీషనరేట్ వ్యాప్తంగా 29 కేసులు నమోదు, 88 మందిపై చర్యలు
కరీంనగర్, అర్జున్ సమాచారం: సైబర్ మోసాలకు వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి నమోదైన వివరాలను సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 29 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, వీటిలో మొత్తం 122 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 89 మందికి సంబంధించి అరెస్ట్లు లేదా చట్టపరమైన నోటీసులు జారీ...