సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను ప్రారంభించిన సీఎం రేవంత్

రంగారెడ్డి,అర్జున్ సమాచారం: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తంగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తోందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాలో 1 కోటి 35 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. సోలార్ మాడ్యూల్స్ తయారీ రంగంలో ప్రసిద్ధ ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం కలిసిన సోలార్ మాడ్యూల్ తయారీ...