ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

స్పార్స – 2026 భేటీలో పాల్గోన్న కేటీఆర్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఫిల్మ్ నగర్లోని JRC కన్వెన్షన్లో జరిగిన ‘స్పార్స – 2026’ వార్షిక సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజ సేవకు అంకితమైన ‘టచ్ ఏ లైఫ్’ (Touch a Life) థీమ్తో సాగుతున్న ఈ సంస్థ, మహిళల విద్య, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ సమావేశంలో కేటీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతుల చదువు మరియు సాధికారత బాధ్యతను స్వీకరించారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవత్వమని, భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి సత్కార్యాలకు పూర్తి సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా SPARSA సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
=========================