‘స్పిరిట్’ సినిమా 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా

రెబల్ స్టార్ ప్రభాస్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలవనుంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో...