స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి : డా. రాజి రెడ్డి
న్యూఢిల్లీ : అర్జున్ సమాచారం: మిరప, ఇతర సుగంధ ద్రవ్యాల వంటి అధిక విలువ కలిగిన పంటల్లో రైతులు పురుగుమందులను విచక్షణారహితంగా వినియోగించడం ఆందోళనకరమని, పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణకే పరిమితం కాకుండా, వాటి అధిక వినియోగాన్ని నివారించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. డి. రాజి రెడ్డి అన్నారు. ఐసీఏఆర్ , న్యూఢిల్లీ ఆధ్వర్యంలోని అఖిల భారత పురుగుమందుల అవశేషాలు , కలుషిత పదార్థాల పర్యవేక్షణ నెట్వర్క్ ప్రాజెక్టు నిర్వహించిన 18వ జాతీయ...