ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

స్వతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి సిద్దిపేట

సిద్దిపేట,అర్జున్ సమాచారం:
జిల్లాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని
జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు.
జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై తగు ఆదేశాలు జారీ చేశారు.  స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా ఇన్నోవేటివ్ గా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధులు, విద్యార్థులు, ప్రజలు, మీడియా వారు అందరూ సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని, త్రాగునీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ముందస్తుగా ఇన్విటేషన్స్ పంపించాలని, అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం పోలీస్ పెరేడ్ నిర్వహణ, ముఖ్య అతిథి ప్రసంగం, ప్రభుత్వ ప్రాధాన్యత  కార్యక్రమాలపై వివిధ శాఖల ద్వారా శకటాల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేయాలని, దేశభక్తి, సాంప్రదాయక పాటలపై విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సిద్దిపేట మున్సిపాలిటీ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కార్యాలయం  సిబ్బంది ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని  సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ లక్ష్మీ కిరణ్, అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.