స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. ఎంపి ఈటల
హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలని అన్నారు. అందుకే ఆ...