హట్టి గోల్డ్ మైన్స్‌ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

అర్జున్ సమాచారం: కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఇందులో భాగంగా, అక్కడ ఉన్న యూటీ (Uti) ఓపెన్ కాస్ట్ గోల్డ్ మైన్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మైన్ వ్యూ పాయింట్ నుండి బంగారం ముడి మట్టి వెలికితీత ప్రక్రియను డిప్యూటీ సీఎం ప్రత్యక్షంగా వీక్షించారు. గనిలో ఎంత లోతు నుంచి బంగారం ముడి సరుకును సేకరిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌లను ఆయన లోతుగా పరిశీలించారు....