హనుమాన్ అంశ్’ సినిమా అక్టోబర్ 9న తెలుగులో విడుదల కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరికొన్ని సినిమాలు రోజులు గడిచేకొద్దీ మౌత్ టాక్‌తో మరింత బలపడతాయి. ‘హనుమాన్ అంశ్’ కూడా అలాంటి చిత్రమే.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన ఈ హిందీ చిత్రం.. ఈ ఏడాదిలో అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పరిమిత స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ‘హనుమాన్ అంశ్’ తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోబినావ్ సత్యా నటించారు....