హయత్‌నగర్‌లో కల్తీ అల్లం – వెల్లుల్లి పేస్ట్ కలకలం 730 కిలోలు సీజ్
అర్జున్ సమాచారం: హయత్‌నగర్‌లోని అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్నట్లు అనుమానిస్తున్న సుమారు 730 కిలోల కల్తీ పేస్ట్‌తో పాటు గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పేస్ట్ తయారీలో స్వాధీనం చేసుకున్న ద్రావణం, ఫుడ్ కలర్ వినియోగంపై దర్యాప్తు కొనసాగుతోంది. =========================