హసీనాకు పాస్‌పోర్ట్ నిరాకరణ.. అరెస్ట్‌కు సిద్ధమైన బంగ్లాదేశ్ ప్రభుత్వం – డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానన్న మాజీ ప్రధాని షేక్ హసీనా – పాస్‌పోర్ట్, ప్రయాణ పత్రాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన బంగ్లా ప్రభుత్వం = దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తామని మంత్రుల హెచ్చరిక – హసీనా రాకపై చర్చలు భారత్‌తోనే ఉంటాయని బంగ్లాదేశ్ వెల్లడి – ఆగస్టు అల్లర్ల కేసులో హసీనాకు ఇప్పటికే మరణశిక్ష విధించిన ట్రైబ్యునల్

బంగ్లాదేశ్ :అర్జున్ సమాచారం: బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విద్యార్థి ఉద్యమంతో పదవి కోల్పోయి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (79), డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 1971 విమోచన యుద్ధ విజయానికి గుర్తుగా జరుపుకునే 'విజయ్ దివస్' (విజయ దినోత్సవం) రోజున తిరిగి రావాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే, ఆమె రాకను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.   ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలోనే భారత్‌కు వెళ్లినందున, తిరిగి ఢాకా...