‘హాయ్’ మూవీ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్

భారతదేశంలోని అగ్రశ్రేణి సూపర్‌స్టార్స్‌ నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన త‌మిళ జీ5 తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘జననాయగ‌న్’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. న‌య‌న్‌, కవిన్ ఈ...