High Joy Commercials బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ “చకోర – Lunar Love Bird”. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హీరో ఆకాష్ జగన్నాథ్ అతిథిగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ – నాకు జీవితంలో పోరాటం నేర్పిన నా తండ్రికి, నాకు స్ఫూర్తిగా నిలిచిన మా అమ్మకు, నా ఇండస్ట్రీ గురువు పూరి జగన్నాథ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా రూపకల్పనలో నాకు అండగా నిలబడిన మా ప్రొడ్యూసర్ చింతాడ హేమారావుకు థ్యాంక్స్. ఇండస్ట్రీలో నాకున్న అనుభవంతో వీలైనంత తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీలో ఈ సినిమాను రూపొందించాను. పేరున్న హీరోలను అప్రోచ్ అయి వారితో సినిమా చేయడం సులువుకాదు. అందుకే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుని శ్రవణ్, మలైకా టి.వాసుపల్ ను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. వీరిద్దరు నేను అనుకున్న విజన్ కు తగినట్లు మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మా సినిమా అక్టోబర్ 9న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచే కాక మీడియాలోని ఫ్రెండ్స్ కు కూడా సినిమా చూపించాం. అందరూ బ్యూటిఫుల్ మూవీ చేశావని ప్రశంసించారు. ప్రేక్షకుల ఆదరణ కూడా మా సినిమా పొందుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
హీరో శ్రవణ్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం సెలెక్ట్ అయినప్పుడు నేనొక రాయిలా ఉన్నాను. నన్ను ఈ పాత్రకు తగినట్లు శిల్పంలా చెక్కిన ఘనత మా డైరెక్టర్ గారికే దక్కుతుంది. మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే మీరు మా సినిమాకు రావొచ్చు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకు మధ్య బాండింగ్, తల్లీ కొడుకు మధ్య అనుబంధం, స్నేహితుల మధ్య ఉంటే బాండింగ్, ప్రేమ జంట మధ్య ఉండే లవ్ మీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – అన్నం ఉడికింది అని తెలియడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు. అలాగే సినిమా బాగుందని చెప్పేందుకు ఒక్క సీన్ చూస్తే చాలు. ఈ సినిమాలోని ప్రతి సీన్ ను బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు మా డైరెక్టర్ మంగా శ్రీనివాస్. అక్టోబర్ 9న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఈ చిత్రాన్ని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ మలైకా టి. వాసుపల్ మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన హీరో ఆకాష్ గారికి థ్యాంక్స్. హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా. ఈ సినిమాలో ఇంద్రజ గారు, సుమన్, బ్రహ్మాజీ వంటి పేరున్న ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే ఒక మంచి ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమలో మాకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు స్ఫూర్తినిస్తారు. వారి ఇన్సిపిరేషన్ తో కొత్త వాళ్లకు అవకాశం కల్పించాలని ప్రొడక్షన్ లోకి వచ్చాం. ఈ చిత్రంలో మీరు ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని ఒక కొత్త తరహా ప్రేమ కథను చూస్తారు. ఈ లవ్ స్టోరీ మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఫస్ట్ కాపీ వచ్చిన రోజే మేము సక్సెస్ అయ్యాం అని నమ్మకం కుదిరింది. సినిమా చూసిన వాళ్లంతా చాలా మంచి మూవీ అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. అక్టోబర్ 9న థియేటర్స్ లో మా మూవీ చూడండి. మీ అందరికీ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందివ్వబోతున్నాం. అన్నారు.
హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ – ఈ సినిమా చూశాను చాలా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. క్వాలిటీలో చూస్తే ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో హీరో శ్రవణ్, హీరోయిన్ మలైకా ను చూస్తే ఈ కథకు వీళ్లు తప్ప మరెవరూ యాప్ట్ కాదు అనిపించింది. అంత బాగా నటించారు. డైరెక్టర్ మంగా శ్రీనివాస్ గారికి ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి. అలాగే ఇలాంటి యంగ్ టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమా నిర్మించిన హేమారావు గారిని అభినందిస్తున్నా. ఆయన లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉండటం వల్లే ఇలా అందరికీ అవకాశాలు వస్తాయి. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఒక కొత్త తరహా ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నా. అన్నారు.
నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు
============================