కమాన్ పూర్ నవంబర్ 3.
అర్జున్ సమాచారం:
హెల్పింగ్ నేచర్ చిన్న సినిమా ఎంతో సందేశం ఇచ్చిందని ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, ఎన్ సి పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి క్షేత్రంలో డ్యాన్స్ మాస్టర్ దర్శకుడు పులిపాక దేవా దర్శకత్వం వహించిన హెల్పింగ్ నేచర్ అనే చిన్న సినిమాను మంగళవారం శ్రీ ఆది వరహాకి స్వామి క్షేత్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రజలకు సందేశం ఇచ్చే చిన్న సినిమాలు తీయాలని దీనికి తమ మద్దతు ఉంటుందని రాజు మరియు శ్రీధర్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో సీనియర్ జర్నలిస్టు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని అన్నారు. నలుగురికి సందేశం ఇచ్చే సినిమాలు తీసి ప్రజలతే మన్ననలు పొందాలని వారి పేర్కొన్నారు. ఉన్నదాంట్లో నలుగురికి సహాయం చేయడమే హెల్పింగ్ నేచర్ అని ఇటువంటి సినిమాలు తీసి ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్, కమాన్ పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, లొంగకేసారం మాజీ సర్పంచ్ ఎండి మంజూరు, ఉప సర్పంచ్ రఫీ సోహెల్, నటీనటుల పద్మలత, మడిపోజు మానస సతీష్, వీర్ల ప్రశాంత్, మేజిక్ శశి, అంజలి, మధునయ్య, సునీల్, శివ, సినిమా దర్శకుడు కందుల వెంకీ, తదితరులు నటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు.