హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న డిజైన్ డెమోక్రసీ 2026
అర్జున్ సమాచారం: భారతదేశంలో ప్రముఖ డిజైన్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన డిజైన్ డెమోక్రసీ నాలుగో ఎడిషన్‌కు సిద్ధమైంది బంజారాహిల్స్ లోని రెడిసన్ బ్లూ హోటల్లో వెల్లడించారు. సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది అన్నారు. 200కు పైగా డిజైన్ బ్రాండ్లు, 150 మందికి పైగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, కళాకారులు, నిపుణులు పాల్గొననున్నారు. 30 వేల మందికి పైగా సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఆర్ట్, టెక్స్‌టైల్స్, హస్తకళలకు సంబంధించిన...