హైదరాబాద్‌లో భారీగా మసాలా పదార్థాల ఆహార కల్తీ గుట్టురట్టు

హైదరాబాద్,అర్జున్ సమాచారం: హైదరాబాద్ లో హెచ్-ఫాస్ట్  జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 వేల కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. మసాలా దినుసుల్లో సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి రంగు, మెరుపు, బరువు పెంచినట్లు అధికారులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత 140 రోజుల్లో హెచ్-ఫాస్ట్ 659 తనిఖీలు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. దాదాపు...