హైదరాబాద్లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నలుగురి అరెస్టు
హైదరాబాద్: అర్జున్ సమాచారం: నగరంలో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. మడుపోజు కర్ణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, కరణ అజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నవంబర్ 1న...