హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ A-380 సర్వీసు

అర్జున్ సమాచారం  :      హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ A-380 సర్వీసులను ప్రారంభించడానికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా -  నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ విమానయాన సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ముఖ్యమంత్రి తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఎమిరేట్స్ A-380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు సంస్థ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని ముఖ్యమంత్రి  కోరారు....