0గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్…. గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ . – గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

జగిత్యాల,అర్జున్ సమాచారం: గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్ అన్నారు. ఈ రోజు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో చింతకుంట చెరువు, కోరుట్లలో  పెద్దవాగు, మెట్పల్లిలోని వట్టి వాగు, ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.... నిమజ్జన ఘాట్‌ల వద్ద ప్రజలకు తాగునీరు, లైటింగ్, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు....