100 కోట్ల ఆస్తులు పైనే డిఈఈ

హైదరాబాద్, నవంబరు 13,అర్జున్ సమాచారం: తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇరిగేషన్ శాఖ డీఈఈగా పనిచేస్తున్న ఆర్. సత్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్‌, విల్లాలు, హైదరాబాద్‌లో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, 50 తులాల బంగారం, మూడు కార్లు, బ్యాంకు డిపాజిట్లు బయటపడ్డాయి. మార్కెట్ విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చనే అంచనాలు సంచలనం సృష్టిస్తున్నాయి....