అడ్డా కార్మికులకు ప్రత్యేక స్థలం కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ఎంపీకి వినతిపత్రం అందజేసిన HMS జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్. మంచిర్యాల, సెప్టెంబర్ 19.మంచిర్యాల పట్టణంలో రోడ్ల పక్కన నిలబడి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న అడ్డా కార్మికులకు శాశ్వత ప్రత్యేక స్థలం కేటాయించి, షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని హింద్ మజ్దూర్ సభ (HMS) మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారికి HMS జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్...