13నుంచి ఆల్బండజోల్ మాత్రలు పంపిణి.
జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం: ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డివార్మింగ్ డే ముందస్తు ఏర్పాట్లపై విద్యా, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1 నుండి...