ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 3:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,పెద్దపల్లి
:
మంథని మండలం మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాల వ్యవహారా న్ని జిల్లా యంత్రాంగం అత్యంత తీవ్రంగా పరిగణి స్తోందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం  తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ శాఖ తనిఖీ నివేదికలు, పంచనామా, సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘం  అధికారులు మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 11 మందిపై  కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ లో ట్యాబ్ ఆపరేటర్ నకిలీ ట్రక్ చిట్లు సృష్టించడం, కొను గోలు రికార్డుల్లో అక్రమ నమోదులు చేయడం, స్టాఫ్ అసిస్టెంట్ అక్రమ ధాన్యం రవాణాకు సహకరించడం, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ప్రమేయంతో కుట్రపూరితంగా వ్యవహరించినట్లు గుర్తించిన ట్లు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న 11 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు, దర్యాప్తులో మరెవరి ప్రమేయం వెలుగులోకి వచ్చినా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల్లో మూడు లారీల్లో తరలిస్తున్న 2,213 బస్తాలు, సుమారు 885.20 క్వింటాళ్లు ధాన్యాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎనిమిది నకిలీ ట్రక్ చిట్ల ద్వారా 5,421 బస్తాలు 2,168.40 క్వింటాళ్లు ధాన్యాన్ని కొనుగోలు రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. రైతుల శ్రమను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పూర్తి పారదర్శకత ను పాటించేలా అన్ని కొనుగో లు కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యల తో పాటు శాఖాపరమై న చర్యలు కూడా తప్పవని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష  తెలిపార.