జిల్లా ఎస్పీని కలిసిన మాజీ ఎంపీ భరత్ వైసీపీ బీసీ నేత పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ ఉపసంహరించాలని వినతి

రాజమహేంద్రవరం,అర్జున్ సమాచారం : వైఎస్సార్సీపీ నగర బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, రామకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆయనపై 12 కేసులు నమోదు చేసి రౌడీ...