ప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై విస్తృత అవగాహన

హుజురాబాద్ టౌన్, జూన్ 30, అర్జున్ సమాచారం : హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్ టౌన్ సెక్షన్‌లో మంగళవారం నిర్వహించిన 'ప్రజాబాట' కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై వినియోగదారులు, వ్యవసాయదారులకు విస్తృత అవగాహన కల్పించామని కరీంనగర్ డీఈ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) శ్రీ ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందికి విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి 'వన్ మినిట్ సేఫ్టీ' సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి పని ప్రారంభించే ముందు ప్రమాదాలను అంచనా వేసి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను...