ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 4:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

హైదరాబాద్, జూన్ 30, అర్జున్ సమాచారం :
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు,  మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు,  ఈ రోజు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
=========================