రైల్వే ఉద్యోగి ఆత్మహత్య కేసు: నిందితురాలి అరెస్ట్
రేణిగుంట ,అర్జున్ సమాచారం : తిరుపతి జిల్లా రేణిగుంట స్థానిక పట్టణంలో సంచలనం సృష్టించిన రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఎస్. ఉషారాణి (35)ను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కిల్లి రవి ఆత్మహత్య చేసుకున్న తర్వాత రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్, పోస్ట్‌మార్టం నివేదిక, సేకరించిన కీలక ఆధారాలు మరియు సాక్షుల...