ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 6:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న సర్కార్ జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పాఠశాల పూర్వ విద్యార్థి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల ,జూన్ 30, అర్జున్ సమాచారం :                                                                          ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.
స్కూల్ అభివృద్ధికి రూ. లక్ష విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే.
క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత, ఉద్యోగ విరమణ పొందుతున్న డీఈఓ, ఉపాధ్యాయుడికి సన్మానం.                                                                                                  రాజన్న సిరిసిల్ల  జూన్ 30: విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పాఠశాల పూర్వ విద్యార్థి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని పీ ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన తరగతి గదులను ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై ప్రారంభించారు.
జాతీయ స్థాయి ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అందించి.. అభినందించారు. అలాగే ఉద్యోగ విరమణ పొందుతున్న డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయుడిని సన్మానించి.. వారి సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈ విద్యాలయంలో అదనపు తరగతి గదులు పూర్తి చేయించామని తెలిపారు. ఈ విద్యాలయంలో బోధన, వసతులపై నమ్మకంతో తల్లిదండ్రులు పిల్లలను అడ్మిషన్ చేస్తున్నారని వివరించారు. 400 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.పదో తరగతిలో ఈ పాఠశాల నుంచి చాలా మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారని వెల్లడించారు. ప్రతి విద్యార్థి తమ నేపథ్యం ఏదైనా తాము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తాము అనుకున్న లక్ష్యం చేరుకుంటారని పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాలు, స్వయం ఉపాధి, ఇతర రంగాల్లో స్థిరపడిన తర్వాత విద్యార్థులు సమాజానికి సేవ చేయాలని సూచించారు. విద్యార్థి దశలో మొక్కలు నాటాలని, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని, నీటి వృథాను అరికట్టాలని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.