రామగుండంలో ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మించేది ఎప్పుడు? 2018 సెప్టెంబర్ లో అనుమతి ఇచ్చిన కేంద్రం అనువైన స్థలం చూపించని గత, నేటి ప్రభుత్వాలు 2025 జనవరిలో కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన కదలని జిల్లా యంత్రాంగం
గోదావరిఖని,అర్జున్ సమాచారం : పెద్దపెల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వంద పడకల ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) ఆస్పత్రి నిర్మాణం ముందుకు సాగడంలో అలసత్వం ఎందుకు జరుగుతుందని రామగుండం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బుధవారం రోజున నిరసన తెలుపడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం రామగుండం స్వచ్చంద సంఘాల అధ్యక్షులు మద్దెల దినేష్ ఉపాధ్యక్షులు *గోలివాడ చంద్రకళ లు మాట్లాడుతూ 2018 లోనే హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి లభించినప్పటికీ గత బిఆర్ఎస్ సర్కార్ అనునువైన స్థలం...