అర్జున్ సమాచారం : తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
దమ్ముంటే రేవంత్ రెడ్డి స్వయంగా సమయం, స్థలం నిర్ణయించి చెబితే చర్చకు వస్తానని అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించడంలో తాను విఫలమైతే అక్కడికక్కడే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ ప్రకటించారు.
సిఏం, అయన కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాళ తీస్తున్నదన్నారు.
కెటిఅర్ ప్రెస్ మీట్ లోని ముఖ్యమైన పాయింట్స్
రేవంత్ రెడ్డి భావ దారిద్ర్యంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం పైన విషం చిమ్ముతున్నాడు. ఎంత దివాలాకోరు మనిషి అయినా, నేను దివాలా తీశాను అని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి ప్రతిసారి తెలంగాణ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఒకసారి దివాలా అంటాడు, మరోసారి ఎయిడ్స్ రోగి అంటాడు, మరోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం గురించి ఇంత నీచంగా మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడో చెప్పాలి. 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి వెళ్లి ఎవరిని బతిమాలుకోవడానికి వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి. నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రెండున్నర సంవత్సరాల పాటు ఇక ఢిల్లీకి వెళ్లకుండా తెలంగాణలోనే ఉండి పరిపాలన చేసి తన నిబద్ధత చాటుకోవాలి.
రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం ఏమాత్రం కాదు. ఒకనాడు దశరథి అన్నట్లు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అయితే, మా కె.సి.ఆర్ గారి సారధ్యంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అయ్యింది. పంటలు, ఆదాయం, సాగునీరు అన్నీ రెట్టింపుకు మించి అభివృద్ధి సాధించింది. అయినా ఇంతటి ధనిక రాష్ట్రాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారో తెలియదు.
తెలంగాణ వ్యక్తిని చూసి కాదు, రేవంత్ రెడ్డిని చూసి అసహ్యించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ కాబట్టే, రేవంత్ రెడ్డిని చూడగానే ఒక దొంగ వచ్చాడు అని అనుకోవడంలో తప్పు లేదు. కేంద్రం సహకరించకున్నా అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయాము. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకున్నా, ఒక్క రూపాయి అదనంగా ఇవ్వకున్నా అద్భుతమైన ప్రగతి పథంలో తీసుకుపోయాము. కేవలం కే.సి.ఆర్ గారికి తెలంగాణ అనేది నా సొంత రాష్ట్రం, సాధించి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అన్న నిబద్ధతతో పని చేసినాడు, కాబట్టే ఇంత అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి చెందింది.
ఎంతసేపు అప్పుల పేరుతో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. కానీ బి.జె.పి ఎం.పి రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ అప్పులు కేవలం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆయన అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఆరు లక్షలు, ఏడు లక్షలు, ఎనిమిది లక్షలు అంటూ రోజుకొక మాట అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కేవలం అప్పులే కాదు, రాష్ట్ర ఆదాయంతో పాటు అప్పులకు కడుతున్న మిత్తి లెక్కల పైన కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూ, తెలంగాణను ఏదో దివాలా తీసిన రాష్ట్రంగా చూపించే నీచమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ఒకవేళ రేవంత్ రెడ్డి అంటున్నట్టు తెలంగాణ దివాలా తీయాల్సి వస్తే, కచ్చితంగా అది ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు తన మంత్రివర్గ సహచరులు చేస్తున్న అవినీతి, దోపిడి వల్లనే, లూటీ వల్లనే తెలంగాణ దివాలా తీస్తున్నది అన్నారు. అన్ని తప్పుడు లెక్కలు దొంగ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి కేవలం ఒక్క రాష్ట్ర రైతాంగానికే లక్ష 13 వేల కోట్ల రూపాయల కోట్లు ఎగగొట్టారు. రైతు బంధు ఇవ్వకుండా, సంపూర్ణ రుణ హామీ, రుణమాఫీ చేయకుండా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన ఆర్థిక సహాయం చేయకుండా పూర్తిగా లక్షా 13 వేల కోట్ల రూపాయల రైతులకు ఎగగొట్టి, ఈరోజు సిగ్గులేకుండా రాష్ట్రంలోని రైతాంగం గురించి వారేదో సంతోషంలో ఉన్నారు అని చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని కే.టి.ఆర్ అన్నారు.
==============================