రాష్ట్రంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ కేటీఆర్

అర్జున్ సమాచారం : తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి స్వయంగా సమయం, స్థలం నిర్ణయించి చెబితే చర్చకు వస్తానని అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ...