ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:41 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చర్చలకు సిద్దం.. ఎప్పుడైనా..ఎక్కడైనా

హైదరాబాద్ ,అర్జున్ సమాచారం :
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు హరీష్ రావు ,కేటీఆర్ గురుకులాల పై ఆరోపణలు చేశారు.. ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలి.. మేము చర్చకు సిద్ధం గన్ పార్క్ వద్దకు వచ్చాం. మీ మాజీ మంత్రులు ఆధారాలతో సహా వస్తె ప్రెస్ క్లబ్ కి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
గురువారం నాడు అయన గన్ పార్క్ దగ్గర మీడియాతో మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ మొత్తం టెండర్లు 1143 కోట్లు ఒకసారి 2 వేల కోట్లు ,3 వేల కోట్లు అని ఆరోపణలు చేశారు. ప్రవీణ్ కుమార్  కరీంనగర్ ఎస్పీ గా ఉన్నప్పుడు విద్యార్థి నాయకులుగా మా నిజాయితి తెలుసు. మేము చర్చ చేయడానికి గన్ పార్క్ వద్దకు వచ్చాం. మొత్తం కొనుగోలు ప్రక్రియలో 687.77 కోట్లు టెండర్లు ,ప్రభుత్వ రంగ సంస్థలు 455.23 కోట్లు ఇవ్వడం జరిగింది..మొత్తం 1143 కోట్లు . మొత్తం టెండర్లు 1143 కోట్లు అయితే 2 వేల కోట్లు ,3 వేల కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మఫాత్ లాల్ బట్టలు ధరించవద్దా. మాఫత్ లాల్ మాకు ఏమైనా చుట్టమ. తెలంగాణ పోరాట వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఐపీఎస్ గా చేసిన వ్యక్తివి చట్టసభల్లో లేవు.. మాజీ మంత్రులు చర్చకు రావాలి. దేవాలయం లాంటి శాసనసభలో ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం టెండర్లు కూడా 2 వేల కోట్లు కాదు, ఒకసారి 2 వేల కోట్లు ,3 వేల కోట్లు . ప్రవీణ్ కుమార్ సెక్రటరీ గా గత 10 సంవత్సరాలుగా సోషల్ వెల్ఫేర్ లో మీరు చేసిన అవినీతిపై విచారణ చేయాలని సీఎం కు ముగ్గురం మంత్రులం విచారణ చేయాలని లేఖలు రాస్తామని అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్  గత 10 సంవత్సరాలుగా అవినీతి చేసిన వ్యక్తి ఏదో మాట్లాడడం కాదు. మేము తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర అసెంబ్లీ ముందు ఉన్నాం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రెస్ క్లబ్ కి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం..ఎవరికి పడితే వారికి జవాబు చెప్పం.. మీ మాజీ మంత్రులు రావాలి. మీ దగ్గర ఆధారాలు తీసుకొని రావాలి. టెండర్లు పారదర్శకంగా ఉందా లేదా చూస్తాం… అందులో ఏ కంపెనీ వస్తె దానికి ఇచ్చారు. కేసీఆర్ ని కోరుతున్న ఇలాంటి  దగల్బుజి వారిని జాగ్రత్తగా ఉంచండి. మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే మీ దగ్గర ఆధారాలు చూపిస్తే మేము ముక్కు నెలకు రాసి రాజీనామా చేస్తాం. శాసన సభ కి రండి చర్చిద్దాం.. లేదా ప్రెస్ క్లబ్ కి మేము మంత్రులుగా వస్తాం  మీ మాజీ మంత్రులు రావాలి. ప్రజా పాలన ప్రభుత్వం లో పేదలకు న్యాయం జరగాలని పని చేస్తున్నాం. 27 గురుకులాలు ఉంటే అందులో మీకు సంబంధించిన ప్రైవేట్ భవనాల్లో పెట్టుకున్నారు.. మేము ఎక్కడ బకాయిలు లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా చెల్లిస్తున్నాం. ప్రవీణ్ కుమార్ ఒళ్ళు,నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..ఎవరు ఏది పడితే అది మాట్లాడితే జాగ్రత్త. కేసిఆర్ శాసనసభ కు రావాలి మేము చర్చకు సిద్ధం.. మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేము తప్పు జరిగితే అధికార పార్టీపైనే కోట్లాడిన వ్యక్తులమని అన్నారు.