ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 1:28 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ ట్రస్ట్ సేవలు ఎనలేనివి.. నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

చిలకలూరిపేట ,అర్జున్ సమాచారం :
నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ ట్రస్ట్ ద్వారా బంగారు వ్యాపారి పఠాన్ యూసుఫ్ చేస్తున్న సేవలు అమూల్యం అని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. 02-07-2026 గురువారం ఉదయం తొమ్మిది గంటలకు దాసరి సురేష్ అనే వికలాంగునికి మూడు చక్రాల సైకిల్ యూసుఫ్ ఆర్థిక సహాయంతో రావు సుబ్రహ్మణ్యం చేతులమీదగా అందించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు వరికూటి నాగేశ్వరావు, పులుగుజ్జు మహేష్,జనసేన పార్టీ నాయకులు ముత్యాల బాబు ప్రముఖ న్యాయవాది సాపా ఆదినారాయణ,కాపుసంఘం నాయకులు అంకిరెడ్డి రమేష్, గట్టా మెడికల్స్ ఆధిపతి గట్టా రమేష్,తన్నీరు సురేష్, గంటా పాపారావు,రావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు.
====================