బడ్వేల్ నగరవనం ఘనంగా ప్రారంభం – ప్రజలకు ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన విహార కేంద్రం

బద్వేలు,అర్జున్ సమాచారం : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం  బద్వేలు పట్టణ ప్రజలకు ప్రకృతి సోయగాలను చేరువ చేస్తూ అభివృద్ధి చేసిన బద్వేలు నగరవనం ఘనంగా ప్రారంభించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో  చంద్రమోహన్ , డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి , వైఎస్సార్ జిల్లా అటవీ అధికారి  రాజశేఖర్ బాబు  హాజరై నగరవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరవనాలు ఎంతో దోహదపడతాయని...