ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:13 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

న్యాయ వ్యవస్థ లో న్యాయవాది కీలక పాత్ర -బార్ కౌన్సిల్ సభ్యులు రఘునాథ్.

అర్జున్ సమాచారం ,కరీంనగర్ :

న్యాయవ్యవస్థలో న్యాయవాది కీలకమైన పాత్ర పోషిస్తారని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వి రఘునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన డిజిటల్ లైబ్రరీ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పై సెమినార్ నిర్వహించగా ముఖ్య అతిధి గా బార్ కౌన్సిల్ సభ్యులు వి రఘునాథ్ హాజరై మాట్లాడుతూ ప్రజలకు న్యాయం అందించడంలో, రాజ్యాంగ హక్కులను కాపాడడంలో న్యాయవాదులు ముందుంటారు. విధి నిర్వహణలో భాగంగా బెదిరింపులు, దాడులు, తప్పుడు కేసులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం 2026 జూన్ 2 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వల్ల న్యాయవాదులు నిర్భయంగా విధులు నిర్వహించ గలరని తెలిపారు. ఈ చట్టం పై న్యాయవాదులకు అవగాహన కల్పించారు . పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ రఘునాధ్ కు హై కోర్టు లో మంచి పేరుందని, గతం లో హైదరాబాద్ బార్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సీనియర్,జూనియర్ న్యాయవాదులు, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.