న్యాయ వ్యవస్థ లో న్యాయవాది కీలక పాత్ర -బార్ కౌన్సిల్ సభ్యులు రఘునాథ్.

అర్జున్ సమాచారం ,కరీంనగర్ : న్యాయవ్యవస్థలో న్యాయవాది కీలకమైన పాత్ర పోషిస్తారని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వి రఘునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన డిజిటల్ లైబ్రరీ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పై సెమినార్ నిర్వహించగా ముఖ్య అతిధి గా బార్ కౌన్సిల్ సభ్యులు వి రఘునాథ్ హాజరై మాట్లాడుతూ ప్రజలకు న్యాయం అందించడంలో, రాజ్యాంగ హక్కులను కాపాడడంలో న్యాయవాదులు ముందుంటారు. విధి నిర్వహణలో భాగంగా బెదిరింపులు, దాడులు, తప్పుడు కేసులు వంటి...