ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టు దిట్టంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షనిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
గోదావరిఖని,అర్జున్ సమాచారం: పెద్దపెల్లిజిల్లాలోని గోదావరిఖనిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, వడ్డింపు వంటి అన్ని అంశాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బందికి ఆహార భద్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత...