మంగళగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణకు భూమిపూజ రూ.6.3 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్
మంగళగిరి,అర్జున్ సమాచారం : ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణంతో పాటు వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం, శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా...