నరసరావుపేట,అర్జున్ సమాచారం :
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్వజస్తంభం శంకుస్థాపన మహోత్సవ వేడుకలు వెంగళ్ రెడ్డి నగర్ లో నూతనముగా నిర్మాణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణంలో భాగంగా శుక్రవారం ధ్వజస్తంభ నిర్మాణమునకు, ప్రహరీ గోడ నిర్మాణమునకు, నీటి బోరు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు బిల్లా రాంబాబు, రమేష్ అన్నదమ్ములు, కొల్లి బ్రహ్మయ్య, బత్తుల మురళి, కృపాకర్ రావు, చేగు వెంకటేశ్వరరావు, ఏ వి ఆర్ కే సత్యనారాయణ, బొడ్డు వెంకట ఆంజనేయులు, కొత్తూరి ప్రసాదరావు, జగదీష్, రెడ్డి మురళీకృష్ణ, తాడువాయి శ్రీనివాసరావు, అరవపల్లి ప్రదీప్ కృష్ణ, జొన్నలగడ్డ నాగరాజేశ్వరి, కూకుట్ల పద్మావతి అనేక మంది భక్తులు మరియు దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.