ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 2:52 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు వ్యతిరేకిస్తూ నిరసన , రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ లో జీవో ఎంఎస్-396 ప్రకారం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు(RSK) ఏర్పాటును ఎన్టీఆర్ జిల్లా దస్తావేజులేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది..!!

 అర్జున్ సమాచారం :                                                                                                                                   రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ లో జీవో ఎంఎస్-396 ప్రకారం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు(RSK) ఏర్పాటును ఎన్టీఆర్ జిల్లా దస్తావేజులేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది..!!
అందులో భాగంగా ఈరోజు శుక్రవారం విజయవాడ గాంధీనగర్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు,అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు,స్టాంప్ వెండర్లు నల్లరిబ్బన్లు ధరించి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి గారు పాల్గొని ఎక్కడో మహారాష్ట్రలో అది కూడా ముంబై,పూనే నగరాల్లో మాత్రమే ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి లీజు,తనఖా వంటి రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నారని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ,దస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టడం భావ్యం కాదని తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రముల ఏర్పాటు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, అలా ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో తాము మరిన్ని నిరసన కార్యక్రమాలను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షులు పైలా సతీష్ మాట్లాడుతూ తాము అభివృద్ధికి, టెక్నాలజీకి ఎప్పుడు వ్యతిరేకం కాదని కానీ రిజిస్ట్రేషన్& స్టాంపుల శాఖకు అనుబంధంగా తాము 100 సంవత్సరాలకు పైబడి దస్తావేజు లేఖర్లగా సేవలందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్ని కొత్త  తరహ విధానాలు తీసుకొచ్చిన వాటన్నింటినీ నేర్చుకొని అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ, చట్టపరంగా దస్తావేజులు రాస్తూ, ప్రభుత్వానికి,ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
అయితే ప్రస్తుతం పిపిపి విధానంలో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో కొత్తవారికి ట్రైనింగ్ ఉపయోగించుకోవడం కన్నా, ఎంతో అనుభవం నైపుణ్యం గల దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు/ఐడెంటిటీ ఇచ్చి తమ జీవన భృతిని కొనసాగించుకునే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.!!
ఈ కార్యక్రమంలో విజయవాడ గాంధీనగర్ దస్తావేజు లేఖరులు ఎం  చక్రధర్,ఏ వరహాల రావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు,నరేంద్ర, కాజా రమేష్,సూర్యనారాయణ పలువురు యువ దస్తావేజు లేఖరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.