పబ్బతి అంజనేయ స్వామి ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నాగర్ కర్నూలు
నాగర్ కర్నూలు,అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం నాగర్కర్నూల్ జిల్లా ఉరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఉరుకొండపేట గ్రామంలో కోలాహలం నెలకొంది. రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీగా ఎన్నికైన 20 ఏళ్ల నాటి మరిచిపోలేని అనుభూతితో గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కి ఆత్మీయులు, ఆనాటి పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర...