ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 7:46 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పులివెందులలో మాజీ సీఎంను కలిసిన ఉపాధ్యాయ సంఘం నేతలు

పులివెందుల,అర్జున్ సమాచారం:
పులివెందులలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని  ఉపాధ్యాయ సంఘం నేతలు కలిసారు. తమ సమస్యలపై వైఎస్ జగన్ కు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఏర్పాటు చేయడం సరికాదని వైఎస్ జగన్ కు వివరించారు. కేంద్ర విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని వినతి చేసారు. బీఈడీ రాసి ఉద్యోగం పొంది 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఎంపీలు కలిసి సమస్యను వివరిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.